శ్రీలీల కోసం మోక్షజ్ఞ చేసిన పనికి అంతా షాక్? మ్యారేజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Update: 2024-03-05 15:12 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందుకోసం బాలయ్య తెగ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పై అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న టాక్ ప్రకారం చూస్తే.. ఈ ఏడాదో, వచ్చే సంవత్సరమో తప్పకుండా హీరోగా అడుగుపెట్టనున్నాడని తెలుస్తుంది.

ఇకపోతే తాజాగా మోక్షజ్ఞకు సంబంధించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే బాలయ్య తనయుడు టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల కోసం ఓ నిర్ణయం తీసుకున్నాడట. ఈ మధ్య శ్రీలీలను నెట్టింట బూతులతో తెగ ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ‘భగవంత్ కేసరి’ షూటింగ్ సమయంలో మోక్షజ్ఞ-శ్రీలీల ఫ్రెండ్స్ అయ్యారు. అలాగే వీరిద్దరి పై చాలా కామెంట్స్ వినిపించాయి. ఈ రూమర్స్ పై మోక్షజ్ఞ చాలా బాధపడ్డాడట. బాగా డిసప్పాయింట్ అయ్యాడట.

చాలా బాధపడుతూ శ్రీలీల చాలా మంచి అమ్మాయి. ఇలాంటి ట్రోలింగ్ ఆపండి ఫ్లీజ్ అంటూ ప్రత్యేకంగా తన స్నేహితులకు చెప్పి ఇలాంటి కామెంట్స్ రాకుండా జాగ్రత్త వహిస్తున్నాడట. దీంతో శ్రీలీల.. బాలయ్య కుమారుడికి థాంక్యూ చెప్పిందట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ నందమూరి అభిమానుల ఆశ్చర్యపోతున్నారు. వీరి యవ్వారం మామూలుగా లేదుగా.. నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా ఏంటి? కాబోయే భార్యను ఇప్పటినుంచే ఏం అననివ్వట్లే కదా? అంటూ జనాలు మరింతగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News