Sree Rapaka: ఆర్జీవీపై బోల్డ్ కామెంట్స్ చేసిన తెలుగు హీరోయిన్.. అలా ఉంటే వదలడు అంటూ
రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘నగ్నం’ మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించిన యంగ్ బ్యూటీ శ్రీ రాపాక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘నగ్నం’ మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించిన యంగ్ బ్యూటీ శ్రీ రాపాక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ తర్వాత ఓ రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ నగ్నం మూవీ అంత హిట్ అయితే కాలేదు. ఇక ఈమె క్రేజ్‌ని చూసిన బిగ్ బాస్ వాళ్ళు ఓటీటి సీజన్లో అవకాశం కూడా ఇచ్చారు. అలా హౌజ్‌లో అడుగుపెట్టిన ఈ భామ అక్కడ ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. కానీ ఉన్న కొన్ని రోజుల్లోనే ఆడియన్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది ఈ బ్యూటీ. ఇక అలా బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక మాత్రం అనుకున్నంత రేంజ్లో అయితే అవకాశాలు రాలేవు. దీంతో ఈ అమ్మడు రాజకీయాల్లో అడుగు పెట్టింది. స్టార్టింగ్‌లో టిడిపికి సపోర్ట్‌గా ఉన్న ఈమె ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసింది. కానీ ఈ ఎన్నికల ముందు మళ్లీ టీడీపీ కూటమికి మద్దతుగా నిలిచింది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ రాపాక ‘నగ్నం’ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను నగ్నం సినిమాలో పూర్తిగా నగ్నంగా నటించలేదు. నా స్కిన్‌లో కలిసిపోయే డ్రెస్ వేసుకున్నాను. కానీ దీన్ని ఎవరు గమనించరు.. కనబడదు కూడా. అలాగే ఈ సినిమా షూట్ చేసే సమయంలో కేవలం నేను, డైరెక్టర్ ఆర్జీవి కెమెరా మ్యాన్ మాత్రమే ఉన్నాము. అలాగే సినిమాలోని చాలా సన్నివేశాలు కొంతమంది మధ్యలోనే తీశారు. ఇక ఈ మూవీలో నేను పూర్తి నగ్నంగా నటించానని అందరూ అనుకుంటారు. ఒకవేళ నేను పూర్తి నగ్నంగా నటించి ఉంటే మాత్రం నన్ను రాంగోపాల్ వర్మ అస్సలు వదిలేవాడు కాదు. మియా మాల్కోవా పెట్టే యాంగిల్స్ అన్నింటిని నాపై కూడా ప్రయోగించి నన్ను కూడా అలాంటి యాంగిల్స్‌లో ఫొటోస్ తీసి అందాలను అందరికీ చూపించేవాడు”. అంటూ డైరెక్టర్ ఆర్జీవి పై నటి శ్రీ రాపాక షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.