Television couple: తల్లిదండ్రులు కాబోతున్న బుల్లితెర జంట.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
బుల్లితెర జంట రాకింగ్ రాకేష్ సుజాత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
దిశ, సినిమా: బుల్లితెర జంట రాకింగ్ రాకేష్ సుజాతల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రాకేష్ తన లైఫ్‌లో ఎన్నో కష్టాలు పడి.. జబర్దస్త్‌లో టీమ్ లీడర్ రేంజ్‌కు ఎదిగాడు. ఒకవైపు జబర్దస్త్ చేసుకుంటూనే.. పలు షోలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అయితే రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యారేజ్ తర్వాత కూడా వీరిద్దరు కలిసి జబర్దస్త్‌లో స్కిట్లు కూడా చేస్తున్నారు. వీళ్ల జోడీకి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే రాకింగ్ రాకేష్ తమ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
తాజాగా రాకింగ్ రాకేష్ తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా తన వైఫ్ బేబిపంప్‌తో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా “అమ్మా నాన్నా అనే పిలుపుకు దగ్గర్లో.. గొప్ప తల్లిదండ్రులు కావాలని ఆశీర్వదించండి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. నెటిజన్లు, సెలబ్రిటీలు, అభిమానులు వారికి విషెస్ తెలుపుతున్నారు. అలాగే బుల్లి రాకింగ్ రాకేష్ అన్న రాబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
(video link credits to jabardasth rakesh instagram id)