పాన్ ఇండియా మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిన తరుణ్..?
ఒకప్పుడు లవర్ బాయ్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో తరుణ్.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యాడు.
దిశ, సినిమా: ఒకప్పుడు లవర్ బాయ్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో తరుణ్.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యాడు. సినిమా పరిశ్రమకు ఒక సారి గ్యాప్ వస్తే మళ్లీ అవకాశాలు రావడం కాస్త కష్టమే. ఒకవేళ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న హీరోగా కాకుండా కీలకమైన పాత్రలో నటించే అవకాశాలు అందుకుని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏకంగా పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేశాడట తరుణ్. డైరెక్టర్ స్వయంగా ఆయన వద్దకు వెళ్లి కథ వివరించినా తరుణ్ మాత్రం తాను ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటించనని, హీరోగా మాత్రమే కనిపిస్తానని చెప్పి ఆ అవకాశాన్ని తిరస్కరించాడని తెలుస్తుంది.
Read More: స్టార్ డైరెక్టర్ పేరుతో మోసం.. నటుడు బ్రహ్మాజీ ట్వీట్ వైరల్