Alekhya Reddy: నా కూతుళ్ల కోసం పోరాడాల్సి వస్తుందంటూ తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన గ్యాంప్ రేప్ దేశాన్ని కుదిపేస్తోంది. అలాగే ఈ ఘటనలో ఆమెకు న్యాయం జరగాలని ఎంతో మంది నిరసన కూడా మొదలు పెట్టారు.

Update: 2024-08-17 15:09 GMT

దిశ, సినిమా: కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన గ్యాంప్ రేప్ దేశాన్ని కుదిపేస్తోంది. అలాగే ఈ ఘటనలో ఆమెకు న్యాయం జరగాలని ఎంతో మంది నిరసన కూడా మొదలు పెట్టారు. ఆమెకు పోస్ట్ మార్టం చేసిన వైద్యులు కీలక విషయాలు వెల్లడించడంతో అంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ కేసులో నిందితులకు కఠినమైన శిక్ష విధించాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే ఇప్పటికే పలువురు సినీ స్టార్స్, హీరోయిన్స్, ఆర్టిస్టులు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా స్పందించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తారకరత్న భార్య ఆలేఖ్య రెడ్డి రియాక్ట్ అవుతూ ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఇప్పటి వరకు నేను ఎప్పుడూ నా కోసం నిలబడటానికి ప్రయత్నించలేదు. నా హక్కుల కోసం పోరాటం చేయలేదు. కానీ రేపటి నా కూతుళ్ల భవిష్యత్తు కోసం నేను ఈ రోజు గళం విప్పుతున్నాను. మహిళలపై అత్యాచారాలు జరగడం సహించకూడదు.

రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మన చట్టం. దేశంలో మీరు పోరాడలేకపోతే కనీసం ఈ సంఘటన గురించి మాట్లాడండి. సరైన విషయంపై మీరు ధైర్యంగా మాట్లాడటం బెటర్. ఆ పని నేను చేస్తాను. మీరు చేయగలరా?’’ అని నెటిజన్లను ప్రశ్నించింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆలేఖ్య రెడ్డికి సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News