Taraka Ratna's wife Alekhya : విజయ్ సాయి రెడ్డి ఇంట్లో తారకరత్న భార్య.. నందమూరి ఫ్యామిలీ వదిలేసినట్లేనా?

నందమూరి తారకరత్న భార్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నటుడు తారకరత్న ఆకస్మిక మరణం అందరినీ కలిచి వేసింది. ముఖ్యంగా ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న అలేఖ్య బాధ వర్ణనాతీతం

Update: 2024-07-30 15:20 GMT

దిశ, సినిమా : నందమూరి తారకరత్న భార్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నటుడు తారకరత్న ఆకస్మిక మరణం అందరినీ కలిచి వేసింది. ముఖ్యంగా ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న అలేఖ్య బాధ వర్ణనాతీతం. ఆయన మరణం తర్వాత అలేఖ్య కోలుకోవడానికి చాలా రోజులే పట్టిందని చెప్పాలి. ఎప్పుడూ తన భర్త తారకరత్న జ్ఞాపకాలు, పిల్లల ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈమె..

ఇక తారకరత్న ప్రేమ వివాహాన్ని అంగీకరించిని నందమూరి ఫ్యామిలీ, తారక్‌ను దూరం పెట్టిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడే కుటుంబానికి దగ్గర అవుతున్నాను అని సంతోషపడిన తారక్ ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత అలేఖ్య, తన పిల్లలకు ఏ లోటు రాకుండా నందమూరి ఫ్యామిలీ చూసుకుంటుందని బాలకృష్ణ తెలిపారు. కానీ ఆ మధ్య అలేఖ్య చేసిన ఓ పోస్టు సంచలనంగా మారింది. నందమూరి ఫ్యామిలీ నుంచి ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటుందా.. అత్తమామలు ఇంకా ఆమెను అంగీకరించలేదా అనే పలు అనుమానాలు కలిగాయి. కాగా, ఇన్ని రోజుల తర్వాత అలేఖ్య మరోసారి తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసిది. అందులో విజయసాయిరెడ్డి వాళ్ళ ఇంట్లో తాను ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.

అలేఖ్యకు వైసీపీ నేత విజయ సాయిరెడ్డి దగ్గరి బంధువు అవుతారు. ఆ ఫ్యామిలీతో ఈమెకు మంచి సంబంధం ఉంటుంది. అంతే కాకుండా అలేఖ్య చిన్నప్పటి నుంచి వీరి ఇంట్లోనే ఎక్కువ పెరిగిందంట. ప్రస్తుతం ఆమె వారింట్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ సాయిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అలేఖ్య వారింటికి వెళ్లినట్లు సమాచారం. కానీ, ఇది చూసిన కొందరు నందమూరి ఫ్యామిలీ అలేఖ్యను పట్టించుకోవడం లేదు. అందుకే ఆమె విజయ్ సాయి రెడ్డి ఇట్లో ఉంటుంది అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News