మరో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి

నందమూరి తారకరత్న ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Update: 2023-05-06 06:35 GMT
మరో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి
  • whatsapp icon

దిశ, సినిమా: నందమూరి తారకరత్న ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాడుతూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం అటు అభిమానులకు, ఇటు కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా తారకరత్నను ఆయన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం మరచిపోలేక పోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున భర్త ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా తారకరత్న గురించి వరుసగా ఎమోషనల్ పోస్టులు పెడుతూనే ఉంది. కాగా ఇటీవల ఆమె రెండో పెళ్లి ఆలోచనలో ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అలేఖ్య పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తారకరత్నతో ఉన్న ఫోటోని షేర్ చేసిన ఆమె భావోద్వేగానికి లోనైంది. ‘ఈ జీవితానికి నువ్వు .. నేను మాత్రమే. నాకు లైఫ్‌కు సరిపడా జ్ఞాపకాలు ఇచ్చి వెళ్లావు. వాటితోనే జీవితాంతం బతికేస్తా. నా చివరి శ్వాస వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ రాసుకొచ్చింది అలేఖ్య. ఈ మాటల ద్వారా ఆమె తనకు అసలు రెండో పెళ్లి ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చింది.

Read more:

ఆ రూమర్స్ వల్లే మేము విడిపోవాల్సి వచ్చింది.. విడాకులపై నాగచైతన్య కామెంట్స్

Full View

Tags:    

Similar News