బాలీవుడ్ కల్చర్‌కు అలవాటుపడిన తారక్.. ఛీ భార్యను కూడా అక్కడికి తీసుకెళ్లాడా?

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన అంటే ఎంతో మందికి ఎనలేని అభిమానం. ఈయన తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తాడు. ఈయన మాదిరిగానే తన భార్య ప్రణతి

Update: 2024-04-30 11:10 GMT

దిశ, సినిమా : జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన అంటే ఎంతో మందికి ఎనలేని అభిమానం. ఈయన తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తాడు. ఈయన మాదిరిగానే తన భార్య ప్రణతి కూడా కుటుంబ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటుంది.

ఇక ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కువగా ఫొటో షూట్స్ చేయడం, పార్టీలు, పబ్బులు అంటు తిరగడం చాలా తక్కువ. అయితే తాజాగా వీరు ఓ పార్టీలో కనిపించి షాకిచ్చారు. ప్రస్తుతం తారక్ దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ హీరో బాలీవుడ్‌లో కూడా నటిస్తున్నాడు. హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2లో కూడా నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీంతో మూవీలో షూటింగ్ ప్రారంభం కావడంతో ఆయన బాలీవుడ్‌లో సెలబ్రిటీస్ ఇచ్చే పార్టీలకు హాజరవుతున్నాయి.

అయితే ఇటీవల జరిగిన ఓ పార్టీకి తారక్ తన భార్య ప్రణతిని కూడా ముంబై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతున్నాయి. దీంతో ఇది చూసిన తన అభిమానులు,ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడ్డారని, ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ప్రణతిని కూడా బాలీవుడ్ ప్రైవేట్ పార్టీకు తీసుకెళ్లాడూ.. ఛీ తారక్ ఏంటీ ఇలా మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


Similar News