OTT లోకి 'లవ్ టుడే'.. దిల్ రాజుకు నష్టం తప్పదా?
తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా 'లవ్ టుడే'.
దిశ, సినిమా: తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా 'లవ్ టుడే'. ఈ సంవత్సరం కోలీవుడ్‌లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నాడు. కాగా గత వారంలో తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలైన ఈ సినిమా మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. ఇదిలావుంటే.. ఈ సినిమా తమిళ వెర్షన్ డిసెంబర్ 2నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుండగా థియేటర్లతో నడిచే తెలుగు వెర్షన్ కలెక్షన్లకు గండిపడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మూవీ ఓటీటీలో విడుదలైతే ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం కష్టమని, దిల్‌రాజు పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదోననే అనుమానాలు మొదలయ్యాయి.
ఇవి కూడా చదవండి : పవర్ఫుల్ అండ్ మీనింగ్‌ఫుల్ క్యారెక్టర్లే చేస్తా: అనెరి వజని