గ్లామర్ పాత్రలు బోర్ కొడుతున్నాయి.. కొత్త కథలు కావాలంటున్న తమన్నా
దిశ, సినిమా: మిల్కీబ్యూటీ తమన్నా ఇండియన్ ఇండస్ట్రీలో ఓ బ్యాడ్ కల్చర్ ఉందంటోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రముఖ చానెల్‌తో మాట్లాడిన నటి ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో లింగ వివక్ష కొనసాగుతుందని, అయితే కొంతమంది మహిళలపై దీని ప్రభావం పడలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది..Latest Telugu News
దిశ, సినిమా: మిల్కీబ్యూటీ తమన్నా ఇండియన్ ఇండస్ట్రీలో ఓ బ్యాడ్ కల్చర్ ఉందంటోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రముఖ చానెల్‌తో మాట్లాడిన నటి ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో లింగ వివక్ష కొనసాగుతుందని, అయితే కొంతమంది మహిళలపై దీని ప్రభావం పడలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే అమ్మాయిలను కేవలం అందమైన బొమ్మల వలే క్రియేట్ చేస్తున్నారన్న బ్యూటీ పవర్ఫుల్ పాత్రలు కూడా చేయగలమని నిరూపించుకున్నప్పటికీ పారితోషికం కారణంగా తమ ప్రతిభను తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక స్త్రీ ఎప్పటికి అందంగా కనిపించాలనే కోరుకుంటానన్న తమన్నా.. భవిష్యత్తులో గ్లామర్‌కు సంబంధించినవి కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. అంతేకాదు 17ఏళ్ల తన కెరీర్లో ఇంతవరకు నటించని కథలను ఎంచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రస్తుతం తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయినట్లు తెలిపింది.
అలాంటి అబ్బాయి కావాలి.. హెబ్బా పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్