'భోలా' మూవీ సెట్స్‌లో గాయపడిన హీరోయిన్ టబు..
దిశ, సినిమా: 'అల వైకుంఠపురంలో' మూవీలో తల్లి క్యారెక్టర్‌తో రీఎంట్రీ ఇచ్చిన టబు.. ఈ మధ్య హిందీలో 'భూబ్ భులయ్యా 2' సినిమాతోనూ సక్సెస్ అందుకుంది..Latest Telugu News
దిశ, సినిమా: 'అల వైకుంఠపురంలో' మూవీలో తల్లి క్యారెక్టర్‌తో రీఎంట్రీ ఇచ్చిన టబు.. ఈ మధ్య హిందీలో 'భూబ్ భులయ్యా 2' సినిమాతోనూ సక్సెస్ అందుకుంది. కాగా ప్రస్తుతం అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న 'భోలా'లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఆమె.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తుంది.
ట్రక్కును బైక్స్ వెంబడిస్తున్న సీన్‌లో కుడి కన్నుకు గాజు ముక్క తగిలి.. బ్లడ్ బ్లీడ్ అవుతున్నట్లు సమాచారం. అయితే చిన్న గాయమేనని డాక్టర్స్ నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్న మూవీ యూనిట్.. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నట్లు తెలిపింది.
Actor Vishal: షూటింగ్‌లో తీవ్ర గాయలపాలైన స్టార్ హీరో.. ఆసుపత్రికి తరలింపు