ఆ హీరోను గాఢంగా ప్రేమించిన తాప్సీ.. చివరకు రాఖీ కట్టాడానికి ఓకే ఎందుకు చెప్పిందంటే?

తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత పలు సినిమాలు చేసినా

Update: 2024-08-06 12:10 GMT

దిశ, సినిమా :తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత పలు సినిమాలు చేసినా, ఈ బ్యూటీ ఇక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఆఫర్స్ మాత్రం తక్కువే. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ పై కన్ను వేసి అక్కడికి చెక్కేసింది.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాలీవుడ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుని ప్రస్తుతం అక్కడే సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ బ్యూటీ ఓ హీరోతో ప్రేమలో పడిందంట. కానీ చివరకు ఆ హీరోకే రాఖీ కట్టడానికి రెడీ అయ్యిందని టాక్. అసలు విషయంలోకి వెళ్తే.. తాప్సీ మంచు మనోజ్‌తో ప్రేమలో పడిందని అనేక రూమర్స్ వినిపించాయి.అంతే కాకుండా వీరు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారంటూ, అనేక వార్తలు వచ్చాయి. కానీ వీటిపై తాప్సీ ఓపెన్ అయ్యింది. అసలు నేను మనోజ్‌ను లవ్ చేయలేదు. ఎవరో నా మీద కావాలనే ఈ రూమర్ క్రియేట్ చేస్తున్నారు. ఈ అవమానం నాకు పోవాలి అంటే నేను మనోజ్‌కు రాఖీ కట్టాలి . కట్టడానికి కూడా నేను వెనకాడను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News