సహ నటి ప్రియుడితో స్వీనీ డేటింగ్.. మూవీ సెట్లోనే ఆ పని కానిచ్చేశారట!
అమెరికన్ యాక్ట్రెస్ సిడ్నీ స్వీనీ.. సహ నటుడు గ్లెన్ పావెల్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందించింది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎనీవన్ బట్ యూ’ డిసెంబర్ 15న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్
దిశ, సినిమా: అమెరికన్ యాక్ట్రెస్ సిడ్నీ స్వీనీ.. సహ నటుడు గ్లెన్ పావెల్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందించింది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎనీవన్ బట్ యూ’ డిసెంబర్ 15న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటినుంచి వీరిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ ఏర్పడిందని, అది ఇప్పుడు ప్రేమగా మారి డేటింగ్ చేస్తున్నారంటూ చర్చ నడుస్తోంది. దీంతో తనదైన స్టైల్లో రియాక్ట్ అయిన నటి.. ‘కొన్ని నెలల నుంచి నెట్టింట మా గురించి ఓ డ్రామా నడుస్తుంది. నిజానికి ఒక రొమాంటిక్ ఫిల్మ్ నుంచి ప్రజలు కోరుకునేది ఇదే. కానీ దాన్ని రియల్ లైఫ్‌కు అంటగడితే అంగీకరించను. మేము చాలా సరదాగా ఉంటాం. ఒకరినొకరు గౌరవించుకుంటా. కష్టపడి పనిచేస్తాం. కాబట్టి మా చుట్టూ వ్యాపించే కథనాలపై మాట్లాడటం మాకు ఇష్టం లేదు’ అంటూ పుకార్లను కొట్టిపారేసింది. ఇక 2022 ఫిబ్రవరిలో జోనాథన్ డేవినోతో స్వీనీకి నిశ్చితార్థం జరగగా.. 2019 నుంచి గిగి ప్యారిస్‌తో డేటింగ్ చేస్తున్న పావెల్ ఇటీవల గిగికి బ్రేకప్ చెప్పడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి.