పదేళ్లకే ఆ హీరోను పెళ్లి చేసుకోమని అడిగా.. శ్వేతా
ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్ బిగ్‌బితో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆమె.. రీసెంట్ ఇంటర్వ్యూలో 10 ఏళ్ల వయస్సులోనే అమితాబ్ బచ్చన్‌కు ప్రపోజ్ చేసినట్లు తెలిపింది.. Latest Telugu News
దిశ, సినిమా : ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్ బిగ్‌బితో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆమె.. రీసెంట్ ఇంటర్వ్యూలో 10 ఏళ్ల వయస్సులోనే అమితాబ్ బచ్చన్‌కు ప్రపోజ్ చేసినట్లు తెలిపింది. 'నా చిన్నతనంలో అలహాబాద్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మా నాన్న ఎయిర్ ఫోర్స్ అధికారి. ఓ రోజు ఇందిరా గాంధీ చితాభస్మాన్ని గంగలో కలపడానికి రాజీవ్ గాంధీ, అమితాబ్ బచ్చన్ అలహాబాద్ వస్తున్నారని తెలిసింది. దీంతో ఎలాగైన అమితాబ్‌ను కలవాలనుకున్నా. అయితే దీన్ని మా నాన్న సున్నితంగా తిరస్కరించారు. కానీ ఇంట్లో ఎవరికీ తెలియకుండా.. కనీసం బ్రష్ కూడా చేయకుండా వేదిక వద్దకు చేరుకున్నా. ఫంక్షన్ జరుగుతున్న ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే బచ్చన్ దగ్గరకి వెళ్లి మిమ్మల్ని ప్రేమిస్తున్నా, దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగాను. ఆ తర్వాత మా నాన్న వైపు చూస్తే కోపంగా కనిపించాడు. ఇంతలో మరో అధికారి వచ్చి నన్ను అక్కడినుంచి పంపించేశారు. అప్పుడు నాకు సరిగ్గ పదేళ్లు మాత్రమే' అంటూ చెప్పుకొచ్చింది. ఇక అమితాబ్ అంటే తనకు ఎనలేని గౌరవమని, ఆయన స్టేటస్‌తో సంబంధం లేకుండా అందరితో ఒకేలా నడుచుకోవడం ఆశ్చర్యంగా ఉంటుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
బికినీలో రెచ్చిపోయిన నిహారిక.. ఇక అభిమానులు ఊరుకుంటారా..!
పూరి డైరెక్షన్లో చిరు.. ఇంట్రెస్టింగ్గా ఇద్దరి లైవ్ చాట్