శాడిస్ట్ భర్త కావాలంటున్న స్టార్ హీరోయిన్..

దిశ, సినిమా: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఇకపై రెబల్‌గా కనిపించే పాత్రలు చేయనంటోంది. తన కెరీర్‌లో ఇప్పటి వరకూ ధైర్య సాహసాలు కలిగిన ఉమెన్ క్యారెక్టర్లు చేసి అలసిపోయానన్న ఆమె..Latest Telugu News

Update: 2022-08-23 09:02 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఇకపై రెబల్‌గా కనిపించే పాత్రలు చేయనంటోంది. తన కెరీర్‌లో ఇప్పటి వరకూ ధైర్య సాహసాలు కలిగిన ఉమెన్ క్యారెక్టర్లు చేసి అలసిపోయానన్న ఆమె.. భయస్తురాలిగా కనిపించాలనుకుంటున్నట్లు తెలిపింది. త్వరలోనే 'జహాన్ చార్ యార్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్వర.. ఓ సమావేశంలో మాట్లాడుతూ ఇకపై శివంగిలా కాకుండా పిరికి, దుర్భలమైన స్త్రీ, చేసే ప్రతీ పనికి భర్త అనుమతి కోరడం లాంటి భిన్నమైన పాత్రలు పోషించాలని ఉందని చెప్పింది.

'నాకున్న ఈ 'దబాంగ్' కీర్తితో విసిగిపోయా. ఇలాంటి ముద్ర నన్ను అనవసరంగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. సిగ్గుపడే క్యారెక్టర్లు కావాలని రచయితలు, డైరెక్టర్లను అడుగుతున్నా. ఇకపై ఇంట్లోంచి బయటకి అడుగుపెట్టాలన్నా.. ఏం వండాలన్న మొగుడి పర్మిషన్ తీసుకోవాలనే అలాంటి పాత్రలతో ప్రేక్షకులను కదిలించాలని కోరుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చింది. ఇక కమల్ పాండే దర్శకత్వం వహించిన 'జహాన్ చార్ యార్' సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.

ప్రియుడు చనిపోతే జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలా? .. ట్రోలింగ్‌పై నటి ఫైర్ 


Similar News