ప్రొడ్యూసర్స్ ఎన్ని వేషాలు వేసినా.. లైట్ తీసుకుంటా : స్టార్ హీరోయిన్
హాట్ బ్యూటీ స్వరా భాస్కర్ తనను వివాదాస్పద మహిళగా భావించే వారిపై విరుచుకుపడింది. ముఖ్యంగా చిత్ర నిర్మాతలను టార్గెట్ చేసి సీరియస్ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఈ ప్రపంచంలో తనలాగే మొండి వాళ్లుగా.. Latest Telugu News
దిశ, సినిమా : హాట్ బ్యూటీ స్వరా భాస్కర్ తనను వివాదాస్పద మహిళగా భావించే వారిపై విరుచుకుపడింది. ముఖ్యంగా చిత్ర నిర్మాతలను టార్గెట్ చేసి సీరియస్ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఈ ప్రపంచంలో తనలాగే మొండి వాళ్లుగా పరిగణించబడుతున్నవాళ్లంతా ఏకం కావాలని పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న నటి.. ఇందుకు ఇన్‌స్టా రీల్స్ ట్రెండ్‌ను యూజ్ చేసింది. ఎల్లో కలర్ శారీ, పింక్ కలర్ జాకెట్ ధరించి విలేజ్ ఉమెన్‌గా కనిపించిన భామ.. డ్యాన్స్ చేస్తూ అభిమానులను అట్రాక్ట్ చేసింది. 'ప్రొడ్యూసర్స్ నేను కాంట్రవర్షియల్ అని చర్చిస్తుంటే.. నా ఫిల్మ్‌కు మరింత ఎక్కువ ప్రమోషన్ జరుగుతుందని అనుకుంటాను' అంటూ తనపై వచ్చే కామెంట్స్‌ను ఎంత పాజిటివ్‌గా తీసుకుంటుందో, ఎట్ ఏ టైమ్ ఇతరులను ఎంత లైట్‌గా ట్రీట్ చేస్తుందో చెప్పకనే చెప్పేసింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి : ఒక్క పాత్రతో సెక్స్ సైరన్‌గా మారిపోయా.. Neha Dhupia