ప్రియుడు.. తర్వాత స్నేహితుడు అయ్యాడు.. అలా సెట్ చేసేశా..

సీనియర్ హీరోయిన్ సుష్మితా సేన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది. వరుస సిరీస్‌లు, డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. ఇక కెరీర్ విషయం

Update: 2024-04-06 12:26 GMT

దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ సుష్మితా సేన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది. వరుస సిరీస్‌లు, డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. ఇక కెరీర్ విషయం పక్కనపెడితే.. దాదాపు 50ఏళ్ల వయసున్న ఈ బ్యూటీ ఇంకా సింగిల్‌గానే ఉంది. తన కన్నా 15ఏళ్లు ఏజ్ తక్కువ ఉన్న రోహన్‌తో రిలేషన్‌ మెయింటెన్ చేసిన ఆమె.. తర్వాత లలిత్ మోడీతో కూడా ప్రేమాయణం నడిపింది. ఇలా అఫిషియల్‌గా రివీల్ చేశారో లేదో వెంటనే బ్రేకప్‌ కూడా అయిపోయిందని ప్రకటించారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియదు కానీ లలిత్ మోడీ ఆస్తి, ఐశ్వర్యం కోసమే సుస్మిత ఇలా చేసిందనే విమర్శలు ఎదుర్కొంది. ఈ వార్తలతో డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. ఆ టైమ్‌లోనే హార్ట్ సర్జరీ కూడా కావడంతో.. ఈ ఫేజ్ నుంచి బయటపడేందుకు హెల్ప్ చేశాడు ఎక్స్‌బాయ్ ఫ్రెండ్ రోహన్. తన చుట్టే తిరుగుతూ అన్ని సందర్భాల్లోనూ అండగా ఉన్నాడు.

కాగా దీనిపై స్పందించిన సుస్మిత.. తన లైఫ్‌లో రోహన్ పాత్ర గొప్పదని చెప్పుకొచ్చింది. బాయ్ ఫ్రెండ్‌గా ఉన్న అతను ప్రజెంట్ ఫ్రెండ్‌గా చాలా సపోర్ట్ చేస్తున్నాడని తెలిపింది. అయితే ఇలా ఉండగలరా అని ప్రశ్నిస్తే.. దేనికైనా బార్డర్ సెట్ చేస్తే చాలని అంటుంది. మనతో ఎదుటివారు ఎలా వ్యవహరించాలో ఓపెన్‌గా చెప్పాలని, ఆ లిమిట్స్ ఫాలో కావాలని సూచిస్తుంది. కాగా ఈ సీనియర్ బ్యూటీ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని.. కన్న పిల్లల మాదిరిగానే చూసుకుంటూ ప్రశంసలు అందుకుంటుంది


Similar News