రాజు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయా: నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్

టాలీవుడ్‌ స్టార్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్నమూవీ ‘తండేల్‌’.

Update: 2024-05-21 09:43 GMT

దిశ, సినిమా: టాలీవుడ్‌ స్టార్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్నమూవీ ‘తండేల్‌’. రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో NC23 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా చైతూ తండేల్ గురించి ఓ చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.

పాకిస్థాన్ ప్రాదేశిక జలాల వెంబడి పట్టుబడి రెండేండ్లపాటు జైలు శిక్షను అనుభవించి భారత్‌కు తిరిగొచ్చిన రాజు అనే వ్యక్తి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ’తండేల్’. ఈ పాత్ర కోసం నేను తొమ్మిది నెలలు ప్రిపేర్‌ అయ్యా. రాజు ఇంటికెళ్లి.. అతని ధైర్యసాహసాలు, సంకల్పం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయా. మత్స్యకారుల ఇబ్బందులు తెలుసుకునేందుకు వారితో కొంత సమయం గడిపాను. తండేల్‌ నా కెరీర్‌లోనే అతిపెద్ద సినిమా.. ఆ పాత్ర నాకు కావాలి.. అలాంటి స్ఫూర్తిదాయకమైన కథ ఇది. నేను శ్రీకాకుళం యాసతోపాటు ప్రతిదీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నా..అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా తండేల్‌ డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. టాప్‌ బ్యానర్‌ గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే చైతూ, సందీప్‌ వేద్‌, జబర్దస్త్‌ మహేశ్, చందూ మొండేటి అండ్‌ టీం షూటింగ్ లొకేషన్‌లో తీసిన వర్కింగ్ స్టిల్‌ ను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.

Tags:    

Similar News