ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు.. ఆశక్తికరంగా ‘వెట్టైయాన్’ ట్రైలర్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్- ద హంటర్’.
దిశ, సినిమా: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్- ద హంటర్’. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటి వరకు ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ఇటీవల రిలీజైన టీజర్‌కు స్పెషల్ క్రేజ్ వచ్చింది.
ఇక ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 10న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా తాజాగా ‘వెట్టైయాన్- ద హంటర్’ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘ఖైదు చెయ్ ఖైదు చెయ్.. నేరస్తుడిని ఖైదు చెయ్’ అనే నినాదాలతో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్లో ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ, పోరంబోకులకు బాగా భద్రత ఉంది. ఇలాంటి మగ మృగాలను ఎన్కౌంటర్లో చంపేయాలి’ అనే డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి.