మరోసారి ప్రేమలో పడిన సూపర్ స్టార్ కుమార్తె.. ఆమె మాట్లాల్లోనే..
సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ పెద్ద కూతరు ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ పెద్ద కూతరు ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాపురం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగినప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టాక మనస్పర్థలు వచ్చి.. రెండేళ్ల క్రితం విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఐశ్వర్య ఒంటరిగా ఉంటూనే డైరెక్టర్‌గా పలు చిత్రాలు తెరకెక్కిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘లాలా సలాం’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఐశ్వర్య గురించి తాజాగా ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..
దక్షిణాది సినిమాకి చెందిన ప్రముఖ సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్ గురించి తెలిసిందే. ప్రస్తుతం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అయితే.. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో, ధనుష్ హీరోగా వచ్చిన సినిమా ‘3’. ఈ చిత్రానికి అనిరుధ్ మొదట సంగీతాన్ని అందించాడు. అప్పుడు అతని వయస్సు దాదాపు 20 సంవత్సరాలు. అలాంటి కుర్రాడుని సంగీత దర్శకత్వం వహించాలని ధనుష్ కోరాడని, అందుకే ఆ సినిమాకు అనిరుధ్‌కి అవకాశం ఇచ్చామని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆయన ఈ స్థాయిలో దూసుకుపోతున్నాడంటే దానికి కారణం ధనుష్ అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య. ప్రస్తుతం ఐశ్వర్య కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో విడాకుల ఇచ్చిన భర్త గురించి ఇంత పాజిటివ్‌గా చెప్పుకొస్తుందంటే.. మరోసారి అన్నతో (ధనుష్) తో ప్రేమలో పడిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.