Rajinikanth : ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆందోళనలో ఫ్యాన్స్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న అర్థరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండె సంబంధిత వైద్య పరీక్షలు చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

Update: 2024-10-01 01:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్న (సెప్టెంబర్ 30) అర్థరాత్రి ఆస్పత్రిలో చేరారు. గుండెకు సంబంధించిన వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్లు తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆయనకు నేడు ఎలక్టివ్ ప్రొసీజర్ చేయనున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అలాగే గుండెకు సంబంధించిన టెస్టులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.

కాగా.. రజినీకాంత్ ఆస్పత్రిలో చేరారన్న వార్తలు రావడంతో.. ఆయనకు ఏమైందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెట్టయాన్, కూలి సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే వెట్టయాన్ సినిమా టీజర్ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అక్టోబర్ 10న దసరా కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రానా, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్ వంటి అగ్రనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. 


Similar News