నందమూరి బాలకృష్ణ అభిమానులకు సూపర్ న్యూస్

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ఇటీవల 'వీర నరసింహారెడ్డి' సినిమాతో హిట్ కొట్టి కాస్త గ్యాప్ ఇచ్చారు..

Update: 2023-02-21 05:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ఇటీవల 'వీర నరసింహారెడ్డి' సినిమాతో హిట్ కొట్టి కాస్త గ్యాప్ ఇచ్చారు. నెక్ట్స్‌ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోగా.. ఈ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్‌కు మరో శుభవార్త అందింది.

బోయపాటితో 'అఖండ' సీక్వెల్ తీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్‌లో నటిస్తాడని, కానీ, అఘోరా రోల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేగాక, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని బోయపాటి భావిస్తున్నాడట. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also Read: రాజమౌళి "RRR" కు మరో ప్రతిష్టాత్మక అవార్డు..

Tags:    

Similar News