సెక్స్ పదం వింటేనే సిగ్గుతో పారిపోయేవాడిని: 'Chhatriwali' పై Sumeet Vyas
ప్రముఖ నటుడు సుమీత్ వ్యాస్ సమాజానికి సెక్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా కావాలంటున్నాడు..
దిశ, సినిమా : ప్రముఖ నటుడు సుమీత్ వ్యాస్ సమాజానికి సెక్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా కావాలంటున్నాడు. రకుల్ ప్రీత్‌సింగ్‌తో కలిసి తను నటించిన 'ఛత్రివాలీ' ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయన.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు తాను యుక్తవయసుకు చేరుకుంటున్నపుడు సెక్స్ పట్ల అపరాధ భావన కలిగివున్నానని, దీంతో క్లాస్ రూమ్‌లో ఎవరైనా ఆ పదం పలికితేనే సిగ్గుతో దూరంగా పారిపోయినట్లు తెలిపాడు. 'శృంగారం అంటే అపవిత్రం కాదని తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది.
ఈ సినిమా చూసిన తర్వాత అందిరికీ నాలాగే అర్థమవుతుంది. ఇందులో ఎవరి మనోభావాలను కించపరచలేదు. ఎక్కడా గీత దాటలేదు. వీక్షకులకు సౌకర్యవంతమైన జోన్‌లోనే చూపించిన చిత్రం చివరకు ముఖ్యమైన సందేశం ఇస్తుంది. కాబట్టి 'ఛత్రివాలీ'ని ఒక సురక్షితమైన ప్రదేశంగా నేను భావిస్తాను. సినిమాకు సంతకం చేసే ముందు స్పష్టమైన వైఖరితోనే ఉన్నాను. ప్రజలకు గొప్ప మెసేజ్ ఇవ్వొచ్చనే నమ్మకం కలిగింది. మరిన్ని ఇలాంటి కథలు చెప్పడానికి ప్రయత్నించాలనిపిస్తోంది' అంటూ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి : మియా.. ఏంటీ మాయ. ఇంకెక్కడా సందు దొరకలేదా?