ఆంటీలతో డేటింగ్ చేసే ఉద్దేశమే లేదు.. టీవీ నటి ఆరోపణలపై సుఖేష్ చంద్రశేఖర్
టీవీ యాక్ట్రస్ చాహత్ ఖన్నా తనకు మ్యారేజ్ అయిందని తెలిసినా కాన్మన్ సుఖేష్ చంద్రశేఖర్ డేటింగ్‌కు ఒత్తిడి చేశాడని ఆరోపించి హెడ్‌లైన్స్‌లో నిలిచింది.
దిశ, సినిమా: టీవీ యాక్ట్రస్ చాహత్ ఖన్నా తనకు మ్యారేజ్ అయిందని తెలిసినా కాన్మన్ సుఖేష్ చంద్రశేఖర్ డేటింగ్‌కు ఒత్తిడి చేశాడని ఆరోపించి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. కాగా ఈ విషయంపై స్పందించిన సుఖేష్.. పెళ్లి అయిన వాళ్లతో డేటింగ్ చేసే ఇంట్రెస్ట్ అసలు లేదని చెప్పుకొచ్చాడు. చాహత్, నిక్కీ తంబోలి లాంటి వాళ్లతో ప్రొఫెషనల్ మీటింగ్స్ మాత్రమే జరిగాయి. ఇక చాహత్‌ను అబద్దాల కోరుగా అభివర్ణించిన సుఖేష్.. 'నేను 2018 నుంచి కాల్ చేసి వేధిస్తున్నప్పుడు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. ఎవరు నిన్ను ఆపారు? ఎందుకు ఆగాల్సి వచ్చింది?' అని ప్రశ్నించాడు.