భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సుజాత.. ఏం చేసిందంటే?
జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న కపుల్ సుజాత, రాకేట్ రాకేష్.వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సుజాత, తర్వాత బిగ్ బాస్‌లోకి
దిశ, సినిమా : జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న కపుల్ సుజాత, రాకేట్ రాకేష్.వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సుజాత, తర్వాత బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక తర్వాత జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రాకింగ్ రాకేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరు జబర్దస్త్‌లో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా, తాజాగా సుజాత తమ పెళ్లై వన్ ఇయర్ అయిన సందర్భంగా, రాకేష్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
తాను తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తాను.. రాకేష్‌కు నేను ఓ ఇల్లుకొన్నాను, ఇది ఎలా ఉందో చూడు అంటూ..కొత్త ఇల్లును చూపించుకుంటూ వచ్చింది. దీంతో రాకేష్ ఎంతగానో సంతోషపడిపోయాడు. కానీ చివరకు ఇది నేను కొనలేదు. అది మన పక్కింటి కవిత వారు కొనుగోలు చేశారు. తను చూసి రమ్మంటే వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రాకేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.