హీరోయిన్లతో లిప్‌ లాక్‌లు, రొమాన్స్‌ వద్దు.. సుడిగాలి సుడిగాలి సుధీర్ సంచలన వ్యాఖ్యలు.. కారణం ఇదే?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచమైన సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

Update: 2024-01-09 14:11 GMT

దిశ, సినిమా: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచమైన సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. జబర్దస్త్‌లో పలు స్కిట్లు చేసి ఆడియన్స్‌ను అలరించిన కొంతమంది కమెడియన్లు.. ప్రస్తుతం సినిమాల్లో దర్శకులుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా, కమెడియన్లుగా, హీరోలుగా చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఓ వైపు బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ.. మరోవైపు ‘సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు’ మూవీల్లో హీరోగా నటించిన విషయం తెలిసిందే. కానీ ఈ చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోలేకపోయాయి.

రీసెంట్‌గా ‘కాలింగ్ సహస్త్ర’ అనే క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రంలో నటించాడు. అయితే సుధీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. సంచలన కామెంట్స్ చేశాడు. ‘‘నేను నటించే మూవీల్లో రొమాన్స్, లిప్ లాక్ సన్నివేశాలు ఉండవు. వాటికి దూరంగా ఉంటాను. అమ్మాయిల నుంచి ఆంటీల వరకు నా మీద అభిమానం చూపిస్తారు. సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు. ఇలాంటి సీన్స్ చూడానికి వారికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే మహిళలంటే నాకు గౌరవం. వారికి తక్కువ చేసి చూడడం, మాట్లాడటం, వారిని అసభ్యంగా చూడటం నా క్యారెక్టర్ కాదు. నా సినిమాల్లో కూడా హారోయిన్లకు ఆ రెస్పెక్ట్ ఉండాలి.’’ అంటూ సుధీర్ చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు.. ‘‘రష్మి ఫీల్ అవుతుందనే కారణంతో సుధీర్ హీరోయిన్లతో లిప్ లాక్ సీన్లు చేయనంటున్నాడు’’ అని కామెంట్లు పెడుతున్నారు. 


Similar News