మహేష్ బాబు చెల్లితో పెళ్లి జరగడంపై సుధీర్ ఆసక్తికర కామెంట్స్!
మహేష్ బాబు చెల్లి భర్త సుధీర్ బాబు అందరికీ సుపరిచితమే. ఆయన ప్రియదర్శినితో పెళ్లయిన తర్వాత కృష్ణ చిన్న అల్లుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: మహేష్ బాబు చెల్లి భర్త సుధీర్ బాబు అందరికీ సుపరిచితమే. ఆయన ప్రియదర్శినితో పెళ్లయిన తర్వాత కృష్ణ చిన్న అల్లుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2012లో శివ మనసులో శృతి అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2013లో ప్రేమ కథా చిత్రమ్‌తో మంచి విజయం అందుకున్నాడు. అయితే సుధీర్ బాబు ఇటీవల మామా మశ్చీంద్ర మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఈ హీరో రెండు మూడు సినిమాతో రాబోతున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్.. ప్రియదర్శినితో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ పెళ్లి చూపులకు ముందు రోజు పేపర్లో ఒక ఫొటో వచ్చింది. అందులో ప్రియదర్శిని చాలా లావుగా ఉంది. దాంతో ఆ పిక్ చూసి భయపడిపోయాను. అయితే పెళ్లి చూపులు పెట్టినప్పుడు నేను మా వాళ్లతో కూర్చొని ఉండగా తను కూడా వచ్చి కూర్చుంది. అప్పుడే నేను ఇంకా ఎవరైనా వస్తారా? అని చూస్తున్నాను.
తనే ప్రియ అని మళ్లీ నాకు పేరు చెప్పారు. ఆ తర్వాత నాకు చిరాకు వచ్చి పెద్ద ఫ్యామిలీ అని చెప్పి పెళ్లిచూపులకు రమ్మంటుందా? అని వెంటనే అమ్మతో అన్నాను. అప్పుడు మా అమ్మ ఏంట్రా అసలు నువ్వు పెళ్లి కూతురిని చూడకుండానే ఇవన్నీ అంటున్నావ్ చూస్తేనే కదా తెలిసేది ఆ అమ్మాయి చాలా బాగుందని చెప్పింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మా పెళ్లి జరిగిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More..
సూపర్‌స్టార్-జక్కన్న సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్