Sudheer Babu: మంచు మనోజ్‌ను మోసం చేసిన సుధీర్ బాబు.. ఆయన రియాక్షన్ ఏంటంటే?

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’.

Update: 2024-10-05 11:00 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. దీనిని లేజర్ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ తెరకెక్కిస్తుండగా.. సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మా నాన్న సూపర్ హీరో’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా, సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా ప్రమోషన్స్ కోసం మంచు మనోజ్‌కు తెలియకుండానే వాడుకుని మోసం చేశారు.

మంచు మనోజ్ అలా బయట కనిపిస్తే.. ఫోటో గ్రాఫర్లు ఆపారు. అలా కాస్త పక్కకు జరగండి.. అంటూ కెమెరాతో ఫోటోలు తీయడం..ఆ టైంలోనే వెనకాల గేట్ మీద మా నాన్న సూపర్ హీరో పోస్టర్ పెట్టడంతో మనోజ్ ఆ సినిమాను ప్రమోట్ చేసినట్టుగా అయింది. మనోజ్ వెనక్కి తిరిగే లోపు గేటు వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఈ వీడియోను సుధీర్ బాబు ‘X’ వేదికగా షేర్ చేశారు. ‘‘క్షమించు బ్రో నాకు ఇంకో ఆప్షన్ దొరకలేదు’’ అని రాసుకొచ్చారు. ఇక ఇదంతా చూసిన మంచు మనోజ్ హవాక్ అయి స్మిమ్మింగ్ ఫూల్‌లో ఉన్న బ్రహ్మానందం జిఫ్‌ను పంపారు. ప్రజెంట్ వీరిద్దరి పోస్టులు చూసిన వారంతా మంచు మనోజ్‌ను భలే మోసం చేశారని అంటున్నారు.


Similar News