K.Vijaybhaskar: అమ్మాయితో మసాజ్‌ సీన్‌ కోసం సినిమానే వదులుకున్న సక్సస్‌ఫుల్‌ దర్శకుడు!

నువ్వే కావాలి, మన్మథుడు, నువ్వు నాకునచ్చావ్‌, మల్లీశ్వరీ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించాడు సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు కె.విజయభాస్కర్‌.

Update: 2024-08-02 15:42 GMT

దిశ, సినిమా: నువ్వే కావాలి, మన్మథుడు, నువ్వు నాకునచ్చావ్‌, మల్లీశ్వరీ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించాడు సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు కె.విజయభాస్కర్‌. త్రివిక్రమ్‌ రచనలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా సూపర్‌హిట్‌గానే నిలిచింది. ఇక త్రివిక్రమ్‌ దర్శకుడిగా మారిన తర్వాత విజయభాస్కర్‌ తన సినిమాల జోరు తగ్గించాడు. అప్పటి నుంచి ఆయన కెరీర్‌లో పెద్దగా విజయవంతమైన చిత్రాలేమీ లేవు. కానీ త్రివిక్రమ్‌ మాత్రం క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. అయితే కొంత విరామం తరువాత విజయ్‌భాస్కర్‌ తెరకెక్కించిన చిత్రం ఉషా పరిణయం. ఆయన తనయుడు శ్రీకమల్‌, తాన్వా ఆకాంక్షను హీరోయిన్‌గా తానే నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఆ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. అయితే ఇటీవల జరిగిన పాత్రికేయుల ముఖాముఖిలో విజయ్‌భాస్కర్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

అందులో భాగంగా మీరు ఓటీటీ వెబ్‌సీరిస్‌లు ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. 'చాలా ఓటీటీ సంస్థలు నన్ను సంప్రందించాయి. కానీ వాళ్లు చేయమన్న జానర్‌ నాకు నచ్చలేదు. కథలో డైలాగులు మార్చి మార్చమని అడిగితే నేను చేయను అని చెప్పాను. అది నా పాలసీ. నా సినిమాలో డబుల్‌ మినింగ్‌ డైలాగ్‌లు, అడల్డ్‌ డైలాగులు, వీధిలో పొట్లాడుకునే టప్పుడు మాట్లాడే భాష నా సినిమాల్లో నేను పెట్టను. కావాలంటే సినిమమాలు మానేస్తాను. అలాంటి సినిమాలు చేయను. ఒక సినిమా పెద్ద సినిమా ఆఫర్‌ వచ్చింది. అందులో అమ్మాయి మాలిష్‌ చేసే సీన్‌ చేయమన్నారు. నేను చేయను అని చెప్పి సినిమా వదులుకున్నాను. నేను అలాంటివి షూట్‌ చేయను అని చెప్పాను. అది నా ప్రిన్స్‌పుల్‌. సినిమా అంటే వాల్యూస్‌ వుండాలి. ఏదైనా అందంగా చూపించేవాడు దర్శకుడు అనేది నా ఫీలింగ్‌. రొమాన్స్‌ను కూడా అందంగా చూపించాలి. కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరూ దర్శకుడు కాలేరు. అందంగా చెప్పేవాడు దర్శకుడు. ఆ వాల్యూస్‌ను కంటిన్యూ చేయాలి. అందరం ఫ్యామిలీ కూర్చొని సినిమా చూడాలి. అలాంటి సినిమాలు తీస్తే చూడగలమా ఫ్యామిలితో.. మనకొక ఫిలిం మేకర్‌గా చాలా బాధ్యత వుంటుంది. సినిమా డిగ్నిటిని పాడు చేయకూడదు. సినిమా సెన్సార్‌కు ముందు మనకు సెల్ప్‌ సెన్సార్‌ వుండాలి కదా.' అంటూ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News