రెండో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ సింగర్.. వరుడు ఎవరో తెలుసా?

స్టార్ సింగర్ కౌసల్య 1999లో ‘నీ కోసం’ చిత్రంతో సింగర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది..

Update: 2023-03-16 05:15 GMT

దిశ, వెబ్ డెస్క్: స్టార్ సింగర్ కౌసల్య 1999లో ‘నీ కోసం’ చిత్రంతో సింగర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కౌసల్య వరుస పాటలు పాడి దూసుకుపోతున్న క్రమంలో పెళ్లి చేసుకుని ఓ కుమారుడికి జన్మనిచ్చింది. ఈ క్రమంలో కౌసల్యకు తన భర్తతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌసల్య షాకింగ్ విషయాలు వెల్లడించింది. ‘‘ వైవాహిక జీవితంలో చాలా బాధలు అనుభవించాను. అప్పుడు నా బాబు చాలా చిన్న పిల్లవాడు కావడంతో భరించి నా భర్త మరో పెళ్లి చేసుకోవాలనుకునే వరకు సర్దుకు పోదామని ఓపికగా ఉన్నాను. కానీ, ఆయన మరొకరిని పెళ్లి చేసుకుని నాతో విడిపోయారు. ప్రస్తుతం నా బాబు పెద్దవాడు అయ్యాడు. వాడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు’’ అంటూ చెప్పుకొచ్చింది. కౌలస్య కొడుకు కోరిక మేరకు రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట. తన అభిప్రాయాలకు మ్యాచ్ అయ్యే వ్యక్తిని చూసి త్వరలో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కౌసల్య రెండో పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Tags:    

Similar News