అమ్మమ్మ కావాల్సిన వయసులో అమ్మ అవ్వాలనుకుంటున్నానంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి స్టార్డమ్ అందుకుంది. భారత దేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును అందుకుంది. అలాగే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, చలన చిత్ర అవార్డ్స్ అని చాలా ప్రశంసలు అందుకుంది. ఇంత గొప్ప ప్రశంసలు అందుకున్న రేఖ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా కష్టాలను చవిచూసిందంట. అలాగే తనకు స్టార్ హీరో అయిన అమితాబ్ బచ్చన్‌కు కూడా ఎఫైర్ ఉందని వచ్చిన వార్తలతో చాలా కుంగిపోయిందట. ఈ క్రమంలోనే తాజాగా రేఖకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేఖ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు చాలా మంది పిల్లలు కావాలి అనుకున్నాను. తల్లి కావాలనే నా కోరిక నెరవేరుతుందని నమ్ముతున్నాను. మా అమ్మ 30 ఏళ్లలోపు పిల్లలు పుట్టాలని ఎప్పుడు చెబుతుండేది. ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉందని నాకు కూడా అనిపించింది. నా పిల్లలు నాతో పాటు ఎదగాలని.. నాకు, వాళ్లకు మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనెప్పుడూ 100 ఏళ్లు ముందుకే ఆలోచిస్తాను. అలాగే నేను ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాను. కానీ ఇంట్లో ఒంటరితనాన్ని తగ్గించడానికి నాకు ఇల్లు నిండుగా పిల్లలు కావాలి. అయితే పెళ్లికి ముందు తల్లిని అవ్వాలనుకోలేదు. ఎందుకంటే నేను మా అమ్మను చూశాను. నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు. దీంతో అమ్మ ఒక్కతే ఎన్నో కష్టాలు పడుతూ మమ్మల్ని పెంచింది. అందుకే పిల్లలను ఒంటరిగా చూసుకోవడం అంత సులువు కాదని నాకు తెలుసు. నాకు బిడ్డ ఎప్పుడు పుడుతుందో తెలియదు.. బహుశా అది ఇంకెప్పటికీ జరగదు కావొచ్చు.’ అంటూ చెప్పుకొచ్చింది రేఖ. కాగా ఆమె ఇప్పటికీ తల్లి కాలేకపోయింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. కానీ, వీరి దాంపత్యం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పెళ్లయిన కొన్ని నెలలకే ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు రేఖ పెళ్లికి దూరంగా ఉంటుంది.