స్టార్ హీరోయిన్ ఈమెయిల్ హ్యాక్ చేసి బెదిరింపులు.. పోస్ట్ వైరల్!

బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగులో ‘సీతారామం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే స్టార్ డమ్ తెచ్చుకుంది..

Update: 2023-03-16 03:08 GMT

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగులో ‘సీతారామం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో నటించి ప్రేక్షకుల్లో ఫుట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. తాజాగా, మృణాల్ ఈమెయిల్‌ ఖాతాను ఆగంతకులు హ్యాక్ చేసినట్టు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నా ఈ-మెయిల్‌ ఖాతా హ్యాక్‌ చేశారు. దీని ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా వ్యక్తిగత సమాచారం, నా సినిమా స్క్రిప్ట్‌లన్నీ అందులోనే ఉన్నాయి’’ అంటూ చెప్పుకొచ్చిన వీడియోను షేర్ చేసింది. అయితే ఇది రానా నాయుడు ప్రమోషన్స్‌‌లో భాగంగా చేసినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మృణాల్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

Tags:    

Similar News