ఆగస్టు లో పోటీ పడుతున్న స్టార్ హీరోలు.. హిట్ కొట్టేదెవరు?

ఆగస్టు లో ఆసక్తికర చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Update: 2024-07-16 03:24 GMT

దిశ, సినిమా: జూలైలో ఇండియన్ 2 తర్వాత స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు ఏమి లేవు. అయితే, ఆగస్టు లో ఆసక్తికర చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

ఇస్మార్ట్ శంకర్‌ తో సూపర్ హిట్ కొట్టిన రామ్ పోతినేని ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో ఆగస్టు 15 న మన ముందుకొస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందే రికార్డ్స్ ను క్రియోట్ చేసింది. ఈ మూవీ పూరి జగన్నాథ్‌కి , హీరో రామ్‌ కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇద్దరూ ఫ్లాప్స్ వల్ల వెనుకబడిపోయారు. ఎలా అయినా పెద్ద హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇండిపెండెన్స్‌ డేని సెంటిమెంట్ గా నమ్ముకుని విక్రమ్ తంగలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విక్రమ్ సినిమాలు హిట్ అవ్వక చాలా కాలం అవుతుంది. ఈ మూవీతో భారీ హిట్ కొట్టి తన మార్కెట్ ను పెంచుకోవాలని కష్టపడుతున్నాడు.

నాని హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా సరిపోదా శనివారం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. 'అంటే సుందరానికి' డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా ఫ్లాప్ అవ్వగా ఇప్పుడు ఎలాగైన హిట్ ఇవ్వాలని చాలా కష్ట పడుతున్నాడు. వీరిలో ఎవరు పెద్ద హిట్ కొట్టి హీరోగా నిలబడతారో తెలియాలంటే ఇంకో నెల వేచి చుడాల్సిందే. 


Similar News