Salman Khan: స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు గాయం.. సరిగ్గా కూర్చోలేని పరిస్థితి (వీడియో)
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రజెంట్ సికిందర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రజెంట్ సికిందర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఆయన చాలా హుషారుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఏ కార్యక్రమానికి హాజరైనప్పటికీ సరదాగా అందరితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది సల్మాన్ డల్‌గా ఉండటంతో పాటు కూర్చిలో కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.
అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల ముంబైలో పర్యావరణానికి హాని చేయకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకోవడంపై అవగాహన కల్పించేందుకు బచ్చే బోలే మోరియా అనే ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. స్టేజ్‌పై ఆయన కూర్చిలో సరిగ్గా కూర్చోలేకపోయాడు. పదే పదే అసౌకర్యంగా పక్కటెముక కుడి భాగాన్ని తాకుతూ కనిపించాడు.
అయితే ఇందులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కూడా ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడటంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఆమె మాట్లాడుతూ.. ‘‘సల్మాన్ ఖాన్ ఆరోగ్యం బాగాలేదు. అతను గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు. పర్యావరణం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని చెప్పవచ్చు’’ అని చెప్పుకొచ్చింది. ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. సల్లూ బాయ్‌కి ఏమైందని ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
(Video Link Credits to beingsalmankhantrky Instagram Channel)