కొడుకు ఫేస్ రివీల్ చేసిన స్టార్ సెలబ్రిటీ కపుల్.. క్యూట్ పిక్స్ వైరల్

సినీ సెలబ్రిటీలు చాలా మంది తమకు పుట్టిన వారి ఫేస్ కొద్ది కాలంపాటు ఫ్యాన్స్‌కు చూపించకుండా ఉంటున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-21 04:17 GMT

దిశ, సినిమా: సినీ సెలబ్రిటీలు చాలా మంది తమకు పుట్టిన వారి ఫేస్ కొద్ది కాలంపాటు ఫ్యాన్స్‌కు చూపించకుండా ఉంటున్న విషయం తెలిసిందే. బుల్లితెర సెలబ్రిటీలు కూడా అదే ఫాలో అవుతున్నారు. అయితే రామ్ చరణ్ కూతురు క్లిన్‌కారా పుట్టి ఏడాది పూర్తైనప్పటికీ మెగా ప్రిన్సెస్ ముఖాన్ని చూపించలేదు. అయినప్పటికీ ఆమె పేరు సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోతోంది. అలాగే కొంతమంది సెలబ్రిటీల పిల్లల ఫొటోలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, స్టార్ సింగర్ గీతా మాధురి కొడుకు క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో అందరినీ ఫిదా చేస్తున్నాయి.

టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి, నటుడు నందు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఇప్పటికే ఓ కూతురు ఉంది. అయితే ఇటీవల వీరికి కొడుకు పుట్టిన విషయాన్ని ప్రకటించారు. కానీ బాబు ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఇక ఆ బాబు పేరు ‘ధృవ ధీర్ తారక్’ అని పెట్టాడు. ఈ జంటకు ఎన్టీఆర్‌పై ఉన్న ఇష్టంతో అతని పేరునే పెట్టారని తెలుస్తోంది. అయితే గీతా మాధురి కొడుకు పుట్టిన ఆరు నెలలు పూర్తి కావొస్తుండటంతో.. సోషల్ మీడియా వేదికగా కొన్ని క్యూట్ ఫొటోలు షేర్ చేసి ఫేస్ రివీల్ చేశారు. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఎంత క్యూట్ ఉన్నాడో అని కామెంట్లు చేస్తున్నారు.

(Video Link Credits to Geetha Madhuri Instagram Channel)

Tags:    

Similar News