ఇద్దరు భర్తలతో పిల్లల్ని కన్న స్టార్ సెలబ్రిటీలు.. హైలైట్‌గా నిలిచిన మెగాస్టార్ కుమార్తె!

పెళ్లనేది జీవితంలో అద్భుతమైన ఘట్టం. నూరేళ్ల బంధం. నాతి చరామీ అనే ప్రమాణంతో చివరివరకు తోడుంటామని అందరిముందు చేసుకునే ఒప్పందం.

Update: 2024-04-08 15:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లనేది జీవితంలో అద్భుతమైన ఘట్టం. నూరేళ్ల బంధం. నాతి చరామీ అనే ప్రమాణంతో చివరివరకు తోడుంటామని అందరిముందు చేసుకునే ఒప్పందం. ఒకప్పుడు పెళ్లంటే సర్డుకుపోవడం అనే కాన్సెప్ట్ బాగా ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో చిన్న చిన్న కారణాలతోనే ఎంతో మంది విడిపోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఉదాహరణకు ఎన్నో జంటలున్నాయి. అందులో ప్రముఖ సెలబ్రిటీలు, వారి పిల్లలు కూడా ఉన్నారు. ఇలా విడిపోయి, తర్వాత వేరే వ్యక్తిని చేసుకుని.. రెండో భర్తతో పిల్లల్ని కన్న సెలబ్రిటీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్‌గా నిలిచారు. వారెవరో చూద్దాం..

అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు దక్కించుకున్న రాధిక 1985లో ప్రతాప్ పోతన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పలు మనస్పర్థల కారణంగా పెళ్లైన ఏడాదిలోనే డివోర్స్ అయ్యాయి. తర్వాత 2001లో శరత్ కుమార్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరికి రోహిత్ అనే అబ్బాయి జన్మించాడు. ఫస్ట్ భర్తతో మరో కుమారుడు కూడా ఉన్నాడు.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీ 2010 లో అశ్విన్ రామ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. వీరికి వేద్ అనే అబ్బాయి పుట్టాడు. ఏమైందో తెలియదు కానీ వీరు 2017లో డివోర్స్ తీసుకున్నారు. తర్వాత విశాగన్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మరో అబ్బయికి జన్మనిచ్చింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ భర్తతో నివ్రితి అనే పాపకు జన్మనివ్వగా.. రెండో భర్తతో నవిష్క అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఇదే బాటలో మరి కొందరు పయణిస్తున్నట్లు తెలుస్తోంది.


Similar News