S. S. Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల.. ఎక్కడ చూడొచ్చంటే..?

ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు విన్న ప్రతి ఒక్కరికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు గుర్తొస్తాయి.

Update: 2024-07-22 07:35 GMT

దిశ, సినిమా: ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు విన్న ప్రతి ఒక్కరికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు గుర్తొస్తాయి. ఇంత వరకు ఓటమే లేదు తీసిన ప్రతీ మూవీ రికార్డ్స్ ను బ్రేక్ చేయడమే కాకుండా చరిత్ర సృష్టిస్తుంది. మన తెలుగు సెలబ్రిటీలు ముద్దుగా జక్కన్న అని పిలుస్తుంటారు. రాజమౌళితో సినిమా చేసే ఏ హీరో అయినా సరే రెండు, మూడేళ్లు డేట్స్ ఇవ్వాల్సిందే. అతను సినిమా కోసం చాలా కష్ట పడతాడు. 24 గంటలు రాజమౌళి దృష్టి సినిమా అవుట్ ఫుట్ మీదే ఉంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి ఇతర దేశాల వారు కూడా మాట్లాడుకునేలా చేసాడు. ఎస్‌ ఎస్ రాజమౌళి వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు పొందారు.

అయితే, తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ ఫ్లిక్స్ రాజమౌళిపై 'మోడరన్ మాస్టర్స్: SS రాజమౌళి' పేరుతో ఒక డాక్యుమెంటరీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

2024 ఆగస్టు 2 న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌గా రానుంది. ఈ డాక్యుమెంటరీలో స్టార్ హీరోలు, డైరెక్టర్స్ జక్కన్న గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. రానా దగ్గుబాటి, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ , జేమ్స్ కామెరూన్, జో రుస్సో, కరణ్ జోహార్‌ వంటి సూపర్ స్టార్లు వీడియోలో కనిపించారు. ఈ డాక్యుమెంటరీ భారతీయ, అంతర్జాతీయ సినిమాలపై రాజమౌళి ప్రభావాన్ని చూపుతుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.

Read more...

sandeepreddy vanga : సందీప్ రెడ్డి వంగ కొడుకు పేరు కూడా ఓ సినిమా పేరే.. అలా ఎందుకు పెట్టారంటే.. 

Full View

Tags:    

Similar News