నానికి జోడీగా కేజీఎఫ్ హీరోయిన్.. చిత్రీకరణ కూడా స్టార్ట్

‘దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ప్రజెంట్ ‘హిట్ 3’తో బిజీగా ఉన్నాడు.

Update: 2024-10-02 08:43 GMT

దిశ, సినిమా: ‘దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ప్రజెంట్ ‘హిట్ 3’తో బిజీగా ఉన్నాడు. శైలేశ్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ‘హిట్ 2’కు సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి సందడి చేయనుందని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ వైజాగ్‌లో జరుగుతోందని తెలుస్తుండగా.. ఇందులో నాని, శ్రీనిధిలకు సంబంధించిన కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు టాక్. ఈ నెల రెండో వారం వరకు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు సమాచారం.

కాగా.. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల ‘హిట్ 3’ నుంచి ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అర్జున్ సర్కార్‌గా నాని చాలా మాస్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

Tags:    

Similar News