స్టార్ హీరోయిన్లకు లేని బాధ నాకెందుకు? ఆ ట్రోలింగ్‌పై Sri Leela
ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో భారీ పాపులారిటీ సంపాదించుకుంది నటి శ్రీ లీల.
దిశ, సినిమా: ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో భారీ పాపులారిటీ సంపాదించుకుంది నటి శ్రీ లీల. 'పెళ్లి సందడి' చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం రవితేజతో నటించిన 'ధమాకా' త్వరలో రిలీజ్ కానుండగా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో 'ధమాకా' సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
'షూటింగ్‌లో రవితేజ గారికి మ్యాచ్ అయ్యేందుకు చాలా కష్టపడ్డాను. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. దర్శకుడు త్రినాథరావు నక్కిన గతంలో తెరకెక్కించిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలో నటించమని అడిగితే రిజెక్ట్ చేశా. ఎందుకంటే అదే టైంలో రైటర్ ప్రసన్న గారు పరిచయమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయా. కానీ, 'పెళ్ళిసందడి' సినిమా అయిపోయిన వెంటనే 'ధమాకా' కథ విని ఓకే చెప్పేశా' అని తెలిపింది.
అలాగే ఏజ్ గురించి వస్తున్న ట్రోల్స్‌పై ప్రశ్నించగా.. 'నా కంటే పెద్ద హీరోయిన్లు వయసు గురించి పట్టించుకోకుండా స్టార్ హీరోలతో నటిస్తున్నారు. అలాంటపుడు నేనెంత చెప్పండి. రవితేజ గారి ఎనర్జీ చూస్తే వయసులో నాకంటే చిన్న వ్యక్తిగా అనిపించింది. అందుకే వయసుకు సంబంధించిన ట్రోలింగ్‌ను పట్టించుకోను' అని తెలిపింది.