Sonakshi Sinha : ఏ స్త్రీ ఈ సమస్య నుంచి తప్పించుకోలేదు.. దేశానికి అధ్యక్షురాలైనా అంతే

మహిళా సెలబ్రిటీల పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతన్న చర్చపై సోనాక్షి సిన్హా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Update: 2023-05-30 09:04 GMT

దిశ, సినిమా: మహిళా సెలబ్రిటీల పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతన్న చర్చపై సోనాక్షి సిన్హా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా తన ఫాలోవర్స్‌తో సరదాగా ముచ్చటించగా.. ‘ఎప్పుడైనా మ్యారేజ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కొన్నావా?’ అనే ఓ అభిమాని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పింది. ‘నా అనుచరుల్లో దాదాపు 500 మంది నా పెళ్లి గురించే ప్రస్తావిస్తుంటారు. కావాలంటే నా కామెంట్స్ సెక్షన్‌ను తెరవండి. వాళ్లంతా ఏమీ కోరుకుంటున్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది’ అని తెలిపింది. ఈ క్రమంలోనే ఏ స్త్రీ కూడా ఈ సమస్య నుంచి తప్పించుకోలేదన్న నటి.. ‘ఒక మహిళ దేశానికి అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ.. జనాలు ఆమె వివాహం గురించి అడగకుండా, మాట్లాడకుండా ఉండలేరు’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. 

Also Read.:  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉరితాడుతో హల్ చల్ చేసిన మోడల్ 

Tags:    

Similar News