Salaar Movie: ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పదా?.. సలార్ టికెట్లపై జోరుగా చర్చ!

ఆఫ్‌లైన్‌లో టికెట్ల విషయమై కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Update: 2023-12-19 05:19 GMT

దిశ,వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్ రెండో ట్రైలర్ సోమవారం విడుదల చేసారు. ట్రైలర్ అదిరిపోయింది.. ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ట్రైలర్‌ను ఎట్టకేలకు విడుదల అయింది. కాగా.. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పీ నైజాంలో సలార్ టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత రోజుల్లో మాదిరిగా.. థియటేర్లలో ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఓపెనింగ్ రోజున నైజానంలోని దాదాపు 15 థియేటర్లలో ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆఫ్‌లైన్‌లో టికెట్ల విషయమై కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయం ఫస్ట్ డే కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.సలార్ మూవీకి ఫ్యాన్స్ ఎగబడటం ఖాయమని.. ఆరోజు థియేటర్లు దద్దరిల్లిపోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స‌లార్ టికెట్ల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. బెంగళూరు సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ. 600 పైనే ఉంటుందని.. మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.1000-రూ.1200 ఉండే అవకాశం ఉందని  సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News