అతి కష్టమైన ఆరు నెలలు గడిచిపోయాయి..Samantha ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతంలో మయోసైటీస్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే.

Update: 2023-07-10 04:12 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతంలో మయోసైటీస్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. దీంతో మూవీలకు బ్రేక్ ఇచ్చి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. అయితే ఇటీవల మళ్లీ వ్యాధి తిరగ బడటంతో ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమెరికాలో చికిత్స తీసుకోనుందని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ చాలా కష్టమైన రోజులు ఈ ఆరు నెలలు క్యార వ్యాన్‌లో గడిచిపోయాయి. వాటికి ఎలాగైనా ముగింపు పలకాలనుకున్నా’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. అందులో సామ్ ఇంతకు ముందులా కనిపించలేదు ముఖంపై కొన్ని మార్పులు వచ్చాయని తెలుస్తోంది. దీంతో అది చూసిన నెటిజన్లు సమంతకు వ్యాధి తిరగబడటం వల్ల మళ్లీ సమస్యలు వస్తాయని అనుకుంటున్నారు.

Also Read: ట్రాన్స్‌జెండర్‌తో సెక్స్.. తలుపులు మూసి టార్చర్ చేశారు: సల్మాన్ మాజీ ప్రేయసి..



Tags:    

Similar News