ఎక్స్‌ట్రాలు చేయకు..నోరు మూసుకో అని రాజమౌళి పై కోపడ్డ సిరివెన్నెల శాస్త్రి గారు..! ఎందుకంటే?

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఏ సినిమా తీసినా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.

Update: 2024-05-28 02:57 GMT

దిశ, సినిమా: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఏ సినిమా తీసినా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అంతే కాకుండా చాలా మంది స్టార్ హీరోలు ఈయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఆరాటపడుతుంటారు. ఎందుకంటే ఆ తర్వాత ఆ హీరోల రేంజ్ అనేది అమాంతం పెరిగిపోతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్, త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్, తారక్‌ల లైఫ్ మరో విధంగా టర్నై గ్లోబల్ స్టార్స్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న ఈ సినిమా బిజీలో ఉన్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో భాగంగా నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం కోసం వెళ్లకూడదనుకున్నా. ఆ విషయాన్ని ఎవరూ బాధపడకుండా ఎలా చెప్పాలో అర్థం కాని సమయంలో శాస్త్రి గారు ఫోన్‌చేస్తే వెళ్లట్లేదని చెప్పా. ఆరోజు ఫస్ట్ టైం ఆయన నన్ను తిట్టారు'.

''భారత ప్రభుత్వం నువ్వు పద్మశ్రీకి అర్హుడివి అని భావించి.. పురస్కారం అందిస్తుంటే ఎందుకు తీసుకోవు. ఎక్స్‌‌ట్రాలు చేయకుండా నోరు మూసుకొని వెళ్లి తీసుకో' అని కోపంగా అన్నారు. అందుకే ఆ వేడుకకు వెళ్లి పురస్కారం తీసుకున్నానని అన్నారు రాజమౌళి. అదేవిధంగా శాస్త్రిగారి దగ్గరికెళ్లి రొమాంటిక్‌ పాటలు రాయమని చెప్పాలంటే నాకు భయం వేసేది. ఆయన పాట రాసే సమయంలో నేను నిద్రపోయేవాడిని అప్పుడు అతను గట్టిగా అరిచి నన్ను లేపేవారు. ఆయన రాసిన మర్యాద రామన్నలో 'పరుగులు తీయ్‌..' పాట నాకెంతో ఇష్టం. ఇప్పటికీ యూట్యూబ్‌లో వింటుంటా. నేను తీసిన ప్రతి సినిమాను చూసి అందులో బాగున్నవి, బాగాలేని సన్నివేశాలను ఫోన్‌ చేసి వివరించి సలహాలు ఇచ్చేవారు. ఆయన ఒక్క సలహా ఇచ్చిన నేను దాని గురించి చాలా రోజులు ఆలోచించే వాడిని. ఎన్నో విషయాల్లో ఆయన నాకు గురువు'. అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి గారు.

Tags:    

Similar News