ఫైనల్‌గా పెళ్లి పీటలు ఎక్కనున్న సింగర్ దేవిశ్రీ..! పెళ్లి కూతురు ఎవరో తెలుసా..?

సింగర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి అందరికి తెలిసిందే. అతి చిన్న వయసులోనే మంచి స్టార్ డమ్‌ను దక్కించుకున్న సింగర్స్‌లో దేవిశ్రీ ఒకరు.

Update: 2023-04-02 15:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి అందరికి తెలిసిందే. అతి చిన్న వయసులోనే మంచి స్టార్ డమ్‌ను దక్కించుకున్న సింగర్స్‌లో దేవిశ్రీ ఒకరు. కెరీర్‌లో ఎన్నో ఒడిదిడుకులు వస్తున్నప్పటికి వాటిని తట్టుకుని మంచి మంచి ఆల్బమ్స్ చేస్తూ.. తన సంగీతంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అంతే కాదు దేవిశ్రీ ప్రసాద్‌ తన పాటలకు ఎన్నో అవార్డులను కైవశం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. దేవిశ్రీ పెళ్లి చేసుకోబోతున్నాడు అని గత 10 ఏళ్ల నుంచి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ.. అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే దేవిశ్రీ పెళ్లి వార్త మరోసారి సోసల్ మీడియాలో హాట్ టాపిగ్‌గా మారింది.

ఫైనల్‌గా పెళ్లి పీటలు ఎక్కనున్న సింగర్ దేవిశ్రీ..తన బంధువుల్లో ఒక అమ్మాయిని దేవిశ్రీ పెళ్లి చేసుకోబోతున్నాడట. అంతే కాదు ఆ అమ్మాయి దేవిశ్రీకి మరదలు కావడంతో పాటు ఇద్దరు ప్రేమలో కూడా ఉన్నారని టాక్. ఇరు కుటుంబ సభ్యుల సమావేశంలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా.. దేవిశ్రీ పెళ్లి చేసుకోబోయో అతని మరదల వయసు 26 సంవత్సరాలు అటా. అంతే దేవిశ్రీ మీద ఆమె 17 సంవత్సరాలు చిన్నది. తన కంటే వయసులో 17 సంవత్సరాలు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారా..? అని కొందరు అంటుంటే, ఏదేమైనా తన అభిమాన సింగర్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని మరికొందరు సంతోషిస్తున్నారు. కాగా.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే దేవిశ్రీ స్పందించాల్సిందే.

ఇవి కూడా చదవండి: Relationship: ఆకర్షణ మొదలు అర్థం చేసుకునేదాకా... రిలేషన్‌షిప్స్ దశలేవో తెలుసా?

Tags:    

Similar News