Singer Chinmai: ‘మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించాడు’ సలార్ నటుడి గుట్టు రట్టు చేసిన లేడీ సింగర్

సింగర్ చిన్మయి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. తరచూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటుంది.

Update: 2024-07-27 03:51 GMT

దిశ, సినిమా: సింగర్ చిన్మయి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. తరచూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటుంది. మహిళలపై, చిన్నారులపై జరిగే లైంగిక దాడులపై నిత్యం పోరాటం చేస్తూనే ఉంటుంది. గతంలో లైంగిక బాధితురాలిగా చిన్మయి కూడా మీటూ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సింగర్ అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలపై కూడా కామెంట్స్ చేస్తూ ఉంటుంది.

తాజాగా సింగర్ చిన్మయి సలార్ చిత్ర నటుడైన జాన్ విజయ్‌పై సంచలన కామెంట్స్ చేసింది. ఈయన ఓ మహిళా జర్నిలిస్టును లైంగికంగా వేధించాడని, ఓ ఇంటర్వ్యూలో తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని చిన్మయి సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌లో రాసుకొచ్చింది. విజయ్ పబ్లో, రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాల్లో కూడా ఆడవాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.

ఈయన డీఎంకేకి చెందిన పర్సన్ అని, వైరముత్తు విజయ్ ఒకే జాతికి చెందిన వారని.. వీరి కంటికి మహిళలు కనిపిస్తే చాలు రెచ్చిపోతారంటూ చిన్మయి ఫైర్ అయ్యింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక జాన్ విజయ్ సలార్ చిత్రంలో రంగ రూల్‌లో నటించారు. తమిళ్, తెలుగు భాషల్లో విలన్ గా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో ముఖ్య పాత్ర పోషించారు.

Tags:    

Similar News