సిద్ధార్ట్ ‘టక్కర్’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. ఈసారైనా హిట్ పడ్డట్లేనా?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్, దివ్యంశా కౌశిక్ జంటగా నటించిన తాజా చిత్రం ‘టక్కర్’.
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్, దివ్యంశా కౌశిక్ జంటగా నటించిన తాజా చిత్రం ‘టక్కర్’. ఈ సినిమాకు డైరెక్టర్ కార్తిక్ క్రిష్ దర్శకత్వం వహించాడు. అయితే సిద్ధార్థ్ ఇటీవల చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన మూవీ టక్కర్ కావడంతో హిట్ కావాలని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా నేడు జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్, తెలుగులో కూడా కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కొంతమంది సినిమా బాగుంది అంటే మరికొంత మంది బోరింగ్ అంటూ కామెంట్లు చేయడంతో ‘టక్కర్’ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ముందు ముందు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.
Also Read: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే మలయాళం మరియు తమిళ సినిమాలు ఇవే