మళ్లీ కలవబోతున్న హీరో సిద్ధార్థ్-సమంత.. మాజీ ప్రియుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పునవసరం లేదు.

Update: 2024-03-10 14:51 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పునవసరం లేదు. ఈ హీరోకు భారీ హిట్ ఇచ్చిన చిత్రం ‘బొమ్మరిల్లు’. దీంతో సిద్ధార్థ్ కు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో అవకాశం వచ్చింది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత సిద్ధార్థ్ కు వరుస ప్లాప్ లు ఎదురయ్యాయి. కథపై అంతగా శ్రద్ధ పెట్టకపోవడంతో చాలా మూవీస్ బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి.

ఇకపోతే ఈ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. తన కెరీర్ గురించి మాట్లాడాక.. యాంకర్, సిద్ధార్థ్ ను మిస్ బ్యూటిఫుల్ ఎవరు అని అడగ్గా వెంటనే ఏమి ఆలోచించకుండా సమంత అని చెప్పేస్తాడు. అలాగే మిస్ పర్ఫెక్ట్ ఎవరు అని అడగ్గా.. మళ్లీ సమంత అని చెప్తాడు. రెండు సార్లు సిద్ధార్థ్.. సమంత పేరు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

స్టార్టింగ్ లో సమంతతో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు కదా, ఇంకా మర్చిపోలేకపోతున్నాడేమో పాపం. సమంతకు ఈ రకంగానైనా తన ప్రేమ తెలుస్తుందేమోనని భావించి ఇంటర్వ్యూలో అందరి ముందు సామ్ పేరు చెప్పి ఉంటాడు. మళ్లీ కలవబోతున్నారు కావచ్చు. ఎలాగు సమంత ఒంటరిగానే ఉంటుంది కదా? ఆ ఉద్ధేశంతో సిద్ధు సమంత పేరు చెప్పాడు. మరీ మాజీ ప్రియుడి కామెంట్లపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సమంతపై సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.


Similar News