నా గురించి తెలియనివాడు.. నా పెళ్లి గురించి ఎలా మాట్లాడుతాడు.. ఫైర్ అయిన శృతి హాసన్

బ్యూటిఫుల్ శృతి హాసన్ ఈ ఏడాది సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకుపోయింది.

Update: 2023-12-29 11:24 GMT

దిశ, సినిమా: బ్యూటిఫుల్ శృతి హాసన్ ఈ ఏడాది సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకుపోయింది. కానీ ఇయర్ ఎండింగ్‌లో మాత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. సెలబ్రిటీలతో ఫొటోస్ దిగుతూ ఫేమస్ అయిన ఓర్రీ.. ఈ యాక్ట్రెస్ బాయ్ ఫ్రెండ్ శంతను హజారికను భర్తగా పేర్కొనడంతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది బ్యూటీ. ఇప్పటి వరకు అన్ని విషయాల్లో ఓపెన్‌గా ఉన్న తాను.. ఈ విషయాన్ని మాత్రం రహస్యంగా ఎందుకు ఉంచుతానని స్పష్టం చేసింది. ఇక తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఓర్రిపై ఫైర్ అయింది. తన గురించి తెలియని వ్యక్తులు తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా సిల్లీగా అనిపిస్తుందని.. నవ్వొస్తుందని తెలిపింది. తన సోషల్ మీడియా ఈ న్యూస్ కారణంగా స్పామ్‌తో నిండిపోయిందని.. అందుకే క్లారిటీ ఇస్తున్నానని చెప్పింది శృతి.

Read More..

హన్సిక ‘105 మినిట్స్’​వచ్చేస్తుంది 

Tags:    

Similar News