యుద్ధం చేయడమే జీవితం కాదు.. ముద్దులు పెట్టడం ఇంపార్టెంట్: శృతి హాసన్

స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌కు పరిచయం అక్కర్లేదు. ఇటీవల వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Update: 2023-07-31 10:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌కు పరిచయం అక్కర్లేదు. ఇటీవల వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. త్వరలో ప్రభాస్‌ సరసన సలార్ చిత్రంలో నటించనుంది. ఇదిలా ఉంటే కెరీర్ పరంగా ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

తరచూ తన బాయ్‌ఫ్రెండ్‌కు సంబంధించిన పోస్టులు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, శృతి హాసన్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ ప్రతి రోజూ యుద్ధం చేయడం కాదు. ఇంట్లో సరదాగా కూర్చుని స్నాక్స్ తింటూ మన పెట్‌లను ప్రేమగా చూసుకోవాలి. క్లారాతో ఆటలు ఆడుతూ ముద్దులు పెడుతూ నా ఒళ్లో కూర్చోబెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ అని రియలైజ్ అయ్యాను’’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Also Read:  'కేజీఎఫ్ 3’ గురించి షాకింగ్ న్యూస్ బయటపెట్టిన యష్! 

Tags:    

Similar News