బహిరంగ ముద్దు సీన్‌పై ట్రోల్స్.. ట్రోలర్స్‌పై శ్రియ ఫైర్
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్ తాజాగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్ తాజాగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అజయ్ దేవ్‌గన్, టబు, శ్రీయ నటించిన 'దృశ్యం 2' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న శ్రియ పబ్లిక్ లోనే భర్తతో లిప్ కిస్ పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో వయసు పెరిగే రెచ్చిపోతుందంటూ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ ట్రోల్స్‌పై శ్రియ స్పందించింది.
''నా ప్రత్యేకమైన క్షణాల్లో నాకు ముద్దు పెట్టడం తనకు (భర్త) సరదా. నా వరకు ఇదొక అందమైన అనుభూతి. భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవడాన్ని ట్రోల్స్ చేయడం ఎందుకో తమకు అర్థం కాలేదు. కానీ.. పర్వాలేదు. ఎందుకంటే నేను చెత్త కామెంట్స్ చదవను. వాటికి స్పందించను. ఎందుకంటే ట్రోల్స్ చేయడం వారి ఉద్యోగం. వాటిని పట్టించుకోకపోవడం నా ఉద్యోగం. నేను చేయాలి అనుకున్నదే చేస్తా'' అంటూ చెప్పకొచ్చింది.
Read More : యూట్యూబ్ ఛానల్స్ విష ప్రచారం చేస్తున్నాయి.. నటి ఆందోళన
Read More : నా ఫస్ట్ క్రష్ సానియా మీర్జానే: వరుణ్ ధావన్